గౌహతి: ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కోసం ఆందోళనకారులు రైళ్ల దిగ్బంధం చేపట్టారు. (Rail Blockade) రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై నిరసన తెలిపారు. దీంతో పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని దారి మళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు, పలు వాహనాల్లో వారిని గమ్యస్థానాలకు చేర్చారు. అస్సాంలోని కూచ్ బెహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కూచ్ బెహార్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కోసం గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ (జీసీపీఏ) బుధవారం రైళ్ల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. దీంతో అలీపుర్దూర్ డివిజన్లోని జోరాయ్ రైల్వే స్టేషన్ వద్దకు ఐదు వేల మందికిపైగా జనం చేరుకున్నారు. రైలు పట్టాలపై నిరసన తెలిపారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
కాగా, రైళ్ల దిగ్బంధంపై నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్) స్పందించింది. న్యూ జల్పైగురి – గౌహతి, బొంగైగావ్-న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లతో సహా పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే బ్రహ్మపుత్ర మెయిల్, కామరూప్ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు, వివేక్ ఎక్స్ప్రెస్ వంటి పలు రైళ్లను దారి మళ్లించింది.
మరోవైపు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పలు రైల్వే స్టేషన్లలో చిక్కుకున్న ప్రయాణికుల కోసం బస్సులు, ఇతర వాహనాలను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఆ వాహనాల్లో ఇతర రైల్వే స్టేషన్లు, గమ్యస్థానాలకు చేర్చారు. అలాగే భద్రత కోసం భారీగా పోలీసులు, ఆర్పీఎఫ్ను మోహరించారు.
On demand of Greater Coochbehar State, GCPA is currently doing a rail blockade at the Jorai Station. Multiple trains impacted. pic.twitter.com/DB47d5tn0T
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) December 11, 2024
Buses being arranged by Alipurduar Division for facilitating passengers affected by the diversion of trains as a result of rail blockade by picketers at Jorai Railway station to travel from New Alipurduar to New Coochbehar. @RailMinIndia pic.twitter.com/kVU3Ux91yU
— Northeast Frontier Railway (@RailNf) December 11, 2024