రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల పట్టాల మీదుగానే రోడ్లు వెళ్తుంటాయి. అక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మూడు రైలు పట్టాల మీదుగా వెళ్తున్న రోడ్డుపై ఒక వ్యక్తి ముందుకు వచ్చేశాడు. చివరి పట్టాలపై రైలు వెళ్తుందని, మధ్యలో ఉన్న పట్టాల వరకు వచ్చేశాడు.
పక్కన ఉన్న వాళ్లు ఆ పట్టాలపై కూడా రైలు వస్తోందని చెప్పడంతో వెనక్కు తిరగబోయాడు. ఆ సమయంలో అతని బైక్.. రైలు పట్టాల్లో ఇరుక్కుపోయింది. దాన్ని పక్కకు లాగలేకపోవడంతో అక్కడే వదిలేసి పక్కకు పరిగెత్తాడతను. వేగంగా వస్తున్న రైలు ఆ బైక్ను ఢీకొట్టింది. అతను కనుక ఒక్క క్షణం ఆ పట్టాలపై ఉంటే ఘోరం జరిగిపోయేదే. యూపీలోని ఎటావాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
WATCH – Commuter's bike gets stuck on railway crossing track in Etawah, blown to pieces by passing train. #ViralVideo pic.twitter.com/WQ3O8NXIxV
— TIMES NOW (@TimesNow) August 29, 2022