Pawan Kalyan | 2026 నూతన సంవత్సరం వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఎంతో కాలంగా ఊరిస్తున్న #PSPK32 ప్రాజెక్ట్‌పై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి మూవీపై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో 32వ చిత్రంగా రూపుదిద్దుకోనుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి (కిక్, రేసు గుర్రం ఫేమ్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. పవన్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్లను దృష్టిలో పెట్టుకుంటే, ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
జనసేన పార్టీలో కీలక నేత, పవన్‌కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్లూరి తన ‘జైత్ర రామ మూవీస్’ (Jaithra Rama Movies) బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ మిలిటరీ ఆఫీసర్ లేదా గన్ కల్చర్ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ మారిన కొత్త హెయిర్ స్టైల్, గడ్డం లుక్ ఈ సినిమా కోసమేనని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుంది.
With folded hands and a full heart 🙏
My dream begins as Production No.1 under #JaithraRamaMovies 🎥
Named with Love & Blessings by our beloved Power Star (PSPK) ❤️
Teaming up with Surender Reddy & Vakkantham Vamsi
Forever grateful. Forever proud.
This dream project is…
— Ram Talluri (@itsRamTalluri) January 1, 2026