Superstar Rajinikanth | ‘ముత్తు’ సినిమా డైలాగ్‌తో న్యూ ఇయర్ విషెస్ తెలిపిన రజనీకాంత్.. వీడియో
Superstar Rajinikanth | 2026 నూతన సంవత్సరం సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపారు.
Superstar Rajinikanth | 2026 నూతన సంవత్సరం సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, తన కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ముత్తు’ సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్‌ను గుర్తు చేశారు. పోయే రూటు కరెక్టేనా అని అడగకండి.. అంతా దేవుడి మీద భారం వేసి ముందుకు సాగడమే! అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటూ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. చెన్నైలోని తన నివాసం (పోయిస్ గార్డెన్) వద్దకు వేలాది మంది అభిమానులు తరలివచ్చి తమ ‘తలైవా’కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, రజనీకాంత్‌ను ఒక్కసారైనా చూడాలనే ఆశతో అభిమానులు బుధవారం రాత్రి నుంచే ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. “తలైవా.. తలైవా” అంటూ నినాదాలు చేస్తూ, కేకులు కట్ చేస్తూ సందడి చేశారు.
— Rajinikanth (@rajinikanth) January 1, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

