అమరావతి : నంద్యాల(Nandyal district) దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను పోషించలేక ఓ భవన కార్మికుడు ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో సురేంద్ర (35) అనే భవన కార్మికుడు భార్య మహేశ్వరి ( 32) అనారోగ్యంతో గతేడాది ఆగస్టు 16న ఆత్మహత్య చేసుకుంది. వీరికి కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్య గగన్ (2) , ముగ్గురు పిల్లలున్నారు. వీరికి పాలలో విషమిచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.