న్యూఢిల్లీ, ఆగస్టు 7: అనర్హతకు గురైన నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ సోమవారం మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేసినట్టు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సూర త్ కోర్టు విధించిన రెండేండ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీంతో ఆయన మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు.