న్యూఢిల్లీ, జూన్ 18: కేరళలోని వయనాడ్ ఎంపీ పదవికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తోపాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి కూడా రాహుల్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో రాయ్‌బరేలీ సీటును ఉంచుకున్న రాహుల్.. వయనాడ్ స్థానానికి రాజీనామా చేసినట్టు లోక్‌సభ సచివాలయం మంగళవారం ప్రకటించింది.