చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కర్ణాల్కు చేరుకున్న రాహుల్.. కబడ్డీ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి అందరినీ ఆశ్చర్యపరిచారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, కుమారి సెల్జా, దీపెందర్ హుడాతోపాటు ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న రాహుల్ మ్యాచ్ను ఆధ్యంతం ఆసక్తిగా తిలకించారు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లను అభినందించారు.
#WATCH | Congress MP Rahul Gandhi watches a Kabbadi match in Haryana's Karnal where he visited for his Bharat Jodo yatra (07.01) pic.twitter.com/VlEUvV9jI7
— ANI (@ANI) January 7, 2023
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ఈ నెల 5న హర్యానాలోకి ప్రవేశించింది. మంగళవారంతో రాష్ట్రంలో ఆయన యాత్ర ముగియనుంది. కాగా, ఆదివారం ఉదయం కర్ణాల్లో ఆయన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనవెంట నడిచారు. ఈ సందర్భంగా కొందరు పార్టీ కారకర్తలు ఎముకలు కొరికే చలిలో కూడా అంగీలు విప్పి డ్యాన్సులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
#WATCH | Congress supporters dance shirtless amid dense fog during Bharat Jodo Yatra in Haryana's Karnal pic.twitter.com/0kmHmkL1nK
— ANI (@ANI) January 8, 2023