కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకొంటున్నట్టుగా ఉన్న ఓ వీడియోను బీజేపీ షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్ పక్కన ఓ మహిళ ఉన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ.. రాహుల్ వ్యక్తిగత జీవితం తమకు అక్కర్లేదని, అయితే వీడియోలో కనిపిస్తున్న చైనా రాయబారితో (మహిళ) ఆయన ఉండటాన్ని కచ్చితంగా ప్రశ్నించాల్సిందేనని పేర్కొన్నది. కష్టాల్లో ఉన్న పార్టీని పట్టించుకోకుండా పార్టీలకు తిరిగే రాహుల్.. ‘పార్టీటైమ్ పొలిటీషియన్’ అని ఎద్దేవా చేసింది.
రాహుల్ నైట్‌క్లబ్ వీడియోను బీజేపీ వైరల్ చేయడంతో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఓ పార్టీలో బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ షాంపేన్ బాటిల్‌ను తెరుస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. ‘ఫొటోలో ఉన్నది ఎవరు?’ అని కామెంట్ చేసింది. నేపాల్‌లో స్నేహితుడి పెండ్లికి రాహుల్ వెళ్లడం నేరమేమీ కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ మాదిరిగా పాకిస్థాన్‌లోని పిలువని వేడుకకు వెళ్లి నవాజ్ షరీఫ్‌తో రాహుల్ కేక్ కట్ చేయలేదని ఎద్దేవా చేశారు.