న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రక్షణ కల్పించటంలో సీఆర్పీఎఫ్ పూర్తిగా వైఫల్యం చెం దిందంటూ కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న ఆరోపణలు సీఆర్పీఎఫ్ గురువారం ఖండించింది. రెండేండ్లలో రాహుల్‌గాంధీ కనీసం వందసార్లు భద్రత నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది.
రాహుల్ యాత్ర ఢిల్లీ చేరుకొన్న సందర్భంగా జెడ్+ క్యాటగిరీ భద్రతను అందించటంలో సీఆర్పీఎఫ్ విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశా రు. ఈనెల 24న ఢిల్లీలో జనం పెద్దఎత్తున రాహుల్ గాంధీని చుట్టుముట్టినప్పుడు ఆయన భద్రతను సీఆర్పీఎఫ్ పట్టించుకోలేదని పేర్కొన్నది. దీన్ని ఖండిస్తూ రాహుల్ గాంధీయే భద్రత నిబంధనలను ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది.