చండీఘడ్ : ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). పూరన్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అక్టోబర్ 7వ తేదీన పూరన్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. పూరన్ మృతి పట్ల నివాళి అర్పించారు. పూరన్ కుమార్ పట్ల క్రమపద్ధతిలో వివక్ష చూపించారని రాహుల్ ఆరోపించారు. వివక్షతో ఆయనలో మనోధైర్యాన్ని దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పూరన్ కెరీర్‌ను డ్యామేజ్ చేశారని ఆరోపించారు.
పూరన్ కుమార్ మరణం ఓ కుటుంబానికి చెందిన అంశం కాదు అని, ఇది దళితుల అంశమని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ, సీఎం నయాబ్ సింగ్ సైనీ తక్షణమే ఈ కేసులో స్పందించాలని కోరారు. సీఎం సైనీ తన హామీలను అమలు చేయడంలో విఫలమైనట్లు పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా దర్యాప్తు చేయడంలో హర్యానా సీఎం విఫలమైనట్లు చెప్పారు. మృతిచెందిన తర్వాత కూడా తన భర్తకు గౌరవాన్ని ఇవ్వలేదని బాధితురాలి భార్య చెప్పినట్లు రాహుల్ తెలిపారు.
#WATCH | Chandigarh: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, “… He was a serving officer. The country understands what type of pressure could have been created on him. Action should be taken against these officers immediately. Arrest the officers and initiate the… https://t.co/uuG6F5tWzu pic.twitter.com/4gjCmuuRjP
— ANI (@ANI) October 14, 2025