కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఫెడరలిజం సహకారవంతం కాదని, అదో బలవంతమైన ఫెడరలిజం అని రాహుల్ ఎద్దేవా చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రాహుల్ గాంధీ విమర్శించారు.
మొత్తం పెట్రో పన్నుల్లో కేంద్రం తన వాటాగా 68 శాతం తీసుకుంటోందని, అయినా… రాష్ట్రాలపై తోసేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. రాష్ట్రాలపై బాధ్యతలను నెట్టేసి, తన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని రాహుల్ ఫైర్ అయ్యారు.
”అధిక పెట్రో ధరలు- రాష్ట్రాలను నిందిస్తున్నారు. బొగ్గు కొరత- రాష్ట్రాలపై నింద, ఆక్సిజన్ కొరత- రాష్ట్రాలపై నింద… రాష్ట్రాలపై నిందలు వేస్తున్నారు. మోదీ బాధ్యతల నుంచి తప్పించుకున్నారు.మోదీ అనుసరించేది సహకారవంతమైన ఫెడరలిజం కాదు. బలవంతమైన ఫెడరలిజం” అని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
High Fuel prices – blame states
Coal shortage – blame states
Oxygen shortage – blame states68% of all fuel taxes are taken by the centre. Yet, the PM abdicates responsibility.
Modi’s Federalism is not cooperative. It’s coercive.
— Rahul Gandhi (@RahulGandhi) April 28, 2022