న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ సీటును వదిలిపెట్టే అవకాశమున్నది. తెలంగాణ లేదా కర్ణాటకలో ఒక చోట నుంచి బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దక్షిణాదితో పాటు యూపీ నుంచి కూడా రాహుల్ ఎప్పటిలాగే పోటీ చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఈ సారి తమ పార్టీకి రెండు కాకుండా 3 సీట్లు కావాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవటంతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తన ఓటర్లలో అధికులు ముస్లిం సమాజానికి చెందిన వారు కావటంతో వయనాడ్ నుంచి పోటీ చేయాలని కోరుతున్నది. దీనికి తోడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పార్టీ ప్రధాన కార్యదర్శి డీ రాజా భార్య అన్నీ రాజాను వయనాడ్ నుంచి పోటీలో దింపింది.