న్యూఢిల్లీ, డిసెంబర్ 13: వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 10న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్ 17న మహారాష్ట్రలోని అకోలలో జరిగిన మీడియా సమావేశంలో వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ అనుచిత, అమర్యాదకర వ్యాఖ్యలు చేశారని న్యాయవాది నృపేంద్ర పాండే కేసు దాఖలు చేశారు. భారత జోడో యాత్రలో సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ ఆంగ్ల సేవకుడు, పెన్షనర్ అంటూ కించపరిచేలా మాట్లాడారని ఆయన ఆరోపించారు.