Odisha Train Accident | రైల్వే మంత్రి రాజీనామాకు రాహుల్ గాంధీ డిమాండ్
వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన ఒడిశా దుర్ఘటన (Odisha Train Accident)చరిత్రలోనే ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
న్యూఢిల్లీ : వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన ఒడిశా దుర్ఘటన (Odisha Train Accident)చరిత్రలోనే ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తుండగా ఈ దుర్ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. 270 మందికి పైగా ప్రాణాలు విడిచినా ప్రభుత్వం జవాబుదారీతనం కొరవడిందని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధాకర ఘటనకు బాధ్యత తీసుకోవడం నుంచి మోదీ ప్రభుత్వం పారిపోలేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు రైల్వే మంత్రిని బాధ్యుడిని చేస్తూ ప్రధాని మోదీ తక్షణమే మంత్రి రాజీనామాను కోరాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
కాగా, ఒడిశాలో రైళ్ల ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి నివేదిక పూర్తి చేశారని.. రిపోర్టు తమకు అందాల్సి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. నివేదిక అందిన తర్వాతే ప్రమాదంపై పూర్తి స్పష్టత వస్తుందని అన్నారు. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధ్యులను కూడా గుర్తించామని తెలిపారు. కవచ్‌కు, ప్రమాదానికి సంబంధం లేదని తెలిపారు. ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
Read More
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

