ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి!
ఈ నెల 17న ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా నిబంధనలను లేబర్ కమిషన్ అధికారులు తుంగలో తొక్కారు. ప్రభుత్వానికి అనుకూలంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చి.. ఓట్ల ఫలితాలను తారుమారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు కొందరు అధికారులు అమ్ముడుపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతు ఉన్న ఓ కార్మికసంఘం నుంచి కమీషన్‌కు ఆశపడ్డారని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు చర్చించుకుంటున్నారు.
- బాణం గుర్తు కేటాయింపు నుంచి ఫలితాల వరకు వివాదాలు
- అవినీతి ఆరోపణలపై కార్మికనేతలు, కార్మికుల్లో విస్తృత చర్చ
- వరంగల్, మెదక్, నల్లగొండ, సికింద్రాబాద్ రీజియన్లలో
- అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా నిబంధనలను లేబర్ కమిషన్ అధికారులు తుంగలో తొక్కారు. ప్రభుత్వానికి అనుకూలంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చి.. ఓట్ల ఫలితాలను తారుమారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు కొందరు అధికారులు అమ్ముడుపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతు ఉన్న ఓ కార్మికసంఘం నుంచి కమీషన్‌కు ఆశపడ్డారని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిన ఒక కార్మిక సంఘం క్లాస్-3(రాష్ట్రవ్యాప్త), క్లాజ్-6(స్థానిక డిపోల) వారీగా ఓడిపోవడంతో పరువు దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలే లేబర్ కమిషన్‌తో నిబంధనలు మార్పించారని చెప్పుకొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సంఘం ఎన్నికల్లో దాదాపు 4వేలకు పైగా మెజారిటీ ఉండటంతో అక్కడ ఎలాంటి అక్రమాలు చేయలేకపోయారని, స్థానిక డిపోల గుర్తింపు ఎన్నికల్లో మాత్రం అవకతవకలకు పురిగొల్పారని అంటున్నారు.
పాత నిబంధనలు తుంగలో తొక్కి..
గతంలో రాష్ట్రవ్యాప్త గుర్తింపు సంఘాన్ని, డిపోల్లో స్థానిక గుర్తింపు సంఘాన్ని ఎన్నిక చేయాలంటే కచ్చితంగా ఫైనల్ ఓటర్ లిస్టును పరిగనలోకి తీసుకొని.. మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా ఒక్క ఓటు వచ్చిన సంఘాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటించేవారు. ఒకవేళ ఏదైనా డిపోలో మెజారిటీ రాకపోవతే.. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంఘమే అక్కడా గుర్తింపు సంఘంగా ఉండేది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిన సంఘానికి తక్కువ డిపోలు రావడం, రాష్ట్రవ్యాప్తంగానూ పేలవ ప్రదర్శన ఉండటంతో.. బోటాబొటీ ఓట్లకు దగ్గరగా ఉన్న డిపోల్లో మొత్తం పోలైన ఓట్లలో నుంచి 50శాతానికి పైగా ఒక్క ఓటు వచ్చిన సంఘానికి స్థానికంగా గుర్తింపు ఇచ్చే నిబంధనను తీసుకొచ్చారని కార్మిక నేతలు చెప్తున్నారు. ఇలా వరంగల్, నల్లగొండ, మెదక్‌లో ప్రభుత్వం మద్దతిచ్చిన గుర్తింపు సంఘం పరువు నిలబెట్టుకున్నది. అర్ధంతరంగా నిబంధనలు మార్చడం వెనుక ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారని ఈయూ కూటమి నేతలు చెప్తున్నారు. ఎన్నికల ఫలితాల తారుమారుపై దసరా తర్వాత పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని చెప్తున్నారు.

Bus Bhavan
ఎన్నికల ప్రక్రియ నుంచే వివాదాలు
తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర్నుంచే లేబర్ కమిషన్‌పై పలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వరుస వివాదాలతో ఆ విభాగం అధికారులు సతమతం అవుతున్నారు. ఎన్నికల ప్రచారం, గుర్తుల కేటాయింపు, పోలింగ్, ఓట్ల లెకింపు.. ఇలా ప్రతి దశలోనూ పారదర్శకత ఉండాల్సి ఉండగా, కొన్ని నిర్ణయాలు వివాదాలకు తావిచ్చాయని ఆరోపిస్తున్నారు. లేబర్ కమిషన్‌పై కార్మిక నేతల్లో, ఇటు ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొనడానికి ప్రధాన కారణం టీఎంయూకు చెందిన బాణం గుర్తును టీడబ్ల్యూయూకు కేటాయించడమేనని అంటున్నారు.
అక్కడే ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారని చెప్తున్నారు. కాగా, టీఎంయూ (థామస్‌రెడ్డి వర్గం)కు నిచ్చెన గుర్తును ఇచ్చినా కూడా కార్మికులు గెలిపించుకోవడంతో కొత్త నిబంధనలు తెచ్చారని పేర్కొంటున్నారు. దీనికితోడు కొందరు అధికారులు డబ్బులకు కక్కుర్తి పడ్డారని కార్మికులు, కార్మిక నేతలు బహిరంగంగా చర్చించుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ నిబంధనలు ప్రవేశపెట్టి ప్రభుత్వం మద్దతిచ్చిన సంఘానికి మేలు చేయడానికే.. 17వ తేదీ ఉదయమే వెల్లడించాల్సిన ఫలితాలను అర్ధరాత్రి ఆందోళనలు చేసిన తర్వాత విడుదల చేశారని కార్మికులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

