Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ ప్రభుత్వం 22 మంది బిలియనీర్లను పెంచిపోషిస్తే తాము కోట్లాది పేద మహిళలను లక్షాధికారులుగా తయారుచేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీచేస్తున్న రాయ్‌బరేలిలో రాహుల్ సోమవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. జూన్ 4న దేశంలో పేదలందరి జాబితాను సిద్ధం చేసి ప్రతి కుటుంబంలోని ఓ మహిళను ఎంపిక చేసి వారి బ్యాంక్ ఖాతాలో ఏటా రూ. లక్ష జమ చేస్తామని చెప్పారు.
మోదీ సర్కార్ బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెడుతోందని దుయ్యబట్టారు. కాగా దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 40.3 శాతం పోలింగ్ నమోదైంది.
Read More :
Loksabha Elections 2024 | బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణుల దాడి : ముగ్గురికి తీవ్రగాయాలు