తిరువనంతపురం : తన పేరు చివర ఎంపీ పదవి, పదాన్ని బీజేపీ తొలగించినా వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తనను నిరోధించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలి ఎంపీగా అనర్హత వేటుకు గురైన అనంతరం రాహుల్ తొలిసారిగా వయనాద్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
నా ఇంటికి పోలీసులను పంపి నన్ను భయపెట్టాలని వారు అనుకున్నారు..వారు ఆ ఇంటిని ఖాళీ చేయించడం తనకు సంతోషం కలిగించిందని, అక్కడ ఉండటం తనకు సంతృప్తిగా లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. నాలుగేండ్ల కిందట ఇక్కడకు వచ్చి మీ ఎంపీగా సేవ చేస్తున్నానని అన్నారు.
తాను ఇక్కడకు ప్రచారానికి రాలేదని, ఇక్కడకు మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని అన్నారు. మీ ప్రేమాభిమానాలతో తాను మీ సోదరుడు, కుమారుడిలా మీకు చేరువయ్యానని చెప్పారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజల సమస్యలను, ఉద్వేగాలను అర్ధం చేసుకోవాలని అన్నారు. నిజమైన ప్రజాప్రతినిధి తాను కోరుకునే విషయాలను వదిలివేయాలని పేర్కొన్నారు.\
Read More