న్యూఢిల్లీ: ఆరెస్సెస్ కార్యకర్త వేసిన ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కోర్టు ఉపశమనం కల్పించింది. ప్రత్యక్షంగా విచారణకు హాజరుకానవసరం లేదని శనివారం భీవండి ఫస్ల్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన శాశ్వత మినహాయంపులు మంజూరుచేసింది. తన తరఫున ప్రతినిధిగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని రాహుల్‌గాంధీ కోర్టును కోరారు.