బెంగళూర్ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నాటకలో పాదయాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ బళ్లారిలో తన క్యాంప్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లో ఓటు వేశారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యాయలంలో కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు.
Mr @RahulGandhi casts his vote at #BharatJodoYatra camp site in Ballari , #Karnartaka #CongressPresidentialPoll pic.twitter.com/0320f5txvf
— Supriya Bhardwaj (@Supriya23bh) October 17, 2022
మాజీ ప్రధాని, పార్టీ నేత మన్మోహన్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే బెంగళూర్‌లో ఓటు వేశారు. పార్టీ ఎంపీ శశి థరూర్‌తో ఖర్గే అధ్యక్ష ఎన్నికల బరిలో తలపడుతున్నారు. అధ్యక్ష ఎన్నికలతో కాంగ్రెస్ పునరుజీవం మొదలైందని సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా కాంగ్రెస్ పార్టీ భవితవ్యం మాత్రం కార్యకర్తల చేతుల్లోకి వచ్చిందని థరూర్ వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం తాను ఖర్గేకు ఫోన్ చేశానని, ఇవాళ్టి ఎన్నికల్లో ఎవరు గెలిచినా తర్వాత మాత్రం మనం స్నేహితులం, సహచరులమేనని చెప్పానని శశిథరూర్ తెలిపారు. కాగా, ఖర్గే సైతం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అధ్యక్ష ఎన్నికలు తమ పార్టీ అంతర్గత ఎన్నికలని చెప్పారు. ఎన్నికల్లో ఎవరం గెలిచినా దాన్ని స్నేహపూర్వకంగానే అంగీకరిస్తామని, కలిసిమెలిసి పార్టీని అభివృద్ధి చేస్తామని అన్నారు.