న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లీగల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఆయన మాట్లాడారు. భారత దేశంలో ఎన్నికల సంఘం వ్యక్తిగతంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలను రిగ్గింగ్ చేయవద్దు అని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ తెలిపారు. ఆ రిగ్గింగ్‌కు చెందిన డేటా, డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయన్నారు. దీన్ని మేం నిరూపిస్తామని, ఆ డేటా ఇప్పుడు ఉందని రాహుల్ పేర్కొన్నారు.
ఓ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన అధ్యయనాన్ని ఆయన వెల్లడించారు. ఆ నియోజకవర్గంలో ఉన్న 6.5 లక్షల ఓటర్లలో 1.5 లక్షల ఓట్లు నకిలీ అని పేర్కొన్నారు. అలా ఫ్రాడ్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 15 లేదా 20 సీట్లు తగ్గి ఉంటే, అప్పుడు మోదీ ప్రధాని అయ్యేవారు కాదు అని రాహుల్ అన్నారు. ఇండియాలో ఎన్నికల సంఘం చచ్చిపోయిందని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవలేదని, నాకు ఆశ్చర్యం వేసిందని, ఎప్పుడైనా ఎన్నికల అవకతవకల గురించి మాట్లాడితే ఆధారాలు అడుగుతున్నారని రాహుల్ అన్నారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ మార్పు కనిపించిందని, లోక్‌సభకు.. విధానసభకు ఎన్నికల జరిగిన సమయంలో కొత్తగా కోటి ఓటర్లు జత కలిశారని, దాంట్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి వెళ్లాయని, అందుకే తన వద్ద ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాని రాహుల్ పేర్కొన్నారు.