Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ హిందూ, హిందుత్వ పదాలను వాడటం ప్రారంభించారు. మహాత్మ గాంధీ 74 వ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. హిందుత్వ వాదులు గాంధీజీ లేరని విశ్వసిస్తారని, కానీ.. గాంధీజీ ఇప్పటికీ ఉన్నారని, ఎక్కడైతే సత్యం వుంటుందో అక్కడ గాంధీజీ వుంటారని రాహుల్ పేర్కొన్నారు. ఓ హిందుత్వవాది గాంధీని చంపేశాడని, ఇక గాంధీజీ లేరని హిందుత్వవాదులందరూ నమ్ముతారని అన్నారు. ఎక్కడైతే సత్యం వుంటుందో, గాంధీజీ ఇప్పటికీ అక్కడ వుంటారని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక గాంధీకి సంబంధించిన ఓ వాక్యాన్ని కూడా రాహుల్ ట్వీట్ చేశారు. నిరాశకు గురైనప్పుడల్లా.. సత్యం, ప్రేమ చరిత్రలో గెలిచిందని ఎప్పుడూ అనుకుంటుంటాను. సమాజంలో నిరంకుశులు, హంతకులూ వున్నారు. కొంత కాలం పాటు వారు అజేయులని మనకు అనిపిస్తుంది. కానీ.. చివరికి వారు పతనం వైపుకే ప్రయాణిస్తారు అని గాంధీజీ పేర్కొన్న వాక్యాన్ని రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.