బెంగళూరు: 86వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో కర్నాటకకు చెందిన రఘు, హర్యానా యువ సంచలనం దేవికా సిహాగ్ తమ విభాగాలలో టైటిల్స్ దక్కించుకున్నారు.
మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రఘు.. 14-21, 21-14, 24-22తో మాజీ చాంపియన్ మిథున్ మంజునాథ్‌ను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మహిళల ఫైనల్లో దేవికా.. 21-15, 21-16తో శ్రీయాన్షి వలిషెట్టిని ఓడించింది.