Priyanka Gandhi | న్యూఢిల్లీ: యూపీలోని రాయ్‌బరేలి నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పోటీచేస్తారని జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. అలాగే ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్న కేరళలోని వయనాడ్ నుంచి కూడా ఆయన రెండో స్థానంగా పోటీచేయనున్నట్టు తెలుస్తున్నది.