రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Chief Minister Hemant Soren) ఇవాళ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారి వయసు పరిమితిని తగ్గించారు. పెన్షన్ అర్హత వయసును 60 ఏండ్ల నుంచి 50 ఏండ్ల వరకు తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సోరెన్ తెలిపారు. ఇక నుంచి 50 ఏండ్లు దాటిన వారు కూడా ఓల్డేజ్ పెన్షన్ అందుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.