న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్లో భారత్‌ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత్-రష్యా బంధం బలపడుతున్న వేళ జరగనున్న పుతిన్ భారత పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. డిసెంబర్ 5న పుతిన్ న్యూఢిల్లీ చేరుకుంటారు. అదే వారంలో జరిగే రష్యా-భారత్ ఫోరమ్ ప్లీనరీ సమావేశంలో పుతిన్ పాల్గొంటారని సమావేశాన్ని నిర్వహిస్తున్న రోస్‌కాంగ్రెస్ తెలిపింది. డిసెంబర్లో పుతిన్ భారత్‌ను సందర్శిస్తారని క్రెమ్లిన్ గతంలోనే ప్రకటించింది. అక్టోబర్‌లో ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన పుతిన్ రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడాలని అన్నారు.