న్యూఢిల్లీ, నవంబర్ 15: ఇకపై రైళ్లలో ప్రయాణికులు ఐఆర్సీటీసీ కిచెన్ల నుంచి పరిశీలించిన, సర్టిఫై చేసిన స్వచ్ఛమైన వెజ్ మీల్స్ (శాకాహారం) పొందనున్నారు. ఈ మేరకు వెజ్ స్టాండర్ట్స్ను నిర్ణయించే సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)కు ఐఆర్సీటీసీకి మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదిరింది. శాకాహార వంట తయారీ, రవాణా, నిల్వను సర్టిఫై చేస్తారు. అయితే ఈ సదుపాయం కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లోనే ఉంటుంది. ప్రధానంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్లలో ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేయనున్నారు. ఢిల్లీ-కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ సాత్విక్ సర్టిఫికెట్ పొందే మొదటి రైలుగా నిలిచే అవకాశం ఉంది. ఈ రైలు వైష్ణో దేవి ఆలయం వరకు వెళ్తుంది.