Punjab women – Niagara Falls : భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో కెనడాకు వెళ్లిన పంజాబ్ యువతి అనూహ్యంగా అదృశ్యమైంది. ప్రకృతి రమణీయతతో అలరారే నయగారా జలపాతం(Niagara Falls) చూసేందుకు వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. ఆమెను పూనమ్దీప్ కౌర్(Poonamdeep Kaur)గా గుర్తించారు. 21 ఏళ్లున్న ఆమె ఏడాది క్రితం స్టూడెంట్ వీసా(Studnt Visa)పై కెనడాకు వెళ్లింది. శుక్రవారం( జూన్ 1వ తేదీ 1) తనస్నేహితులతో కలిసి అందమైన నయగారా వాటర్‌ఫాల్ చూసేందుకు వెళ్లింది.
అయితే.. అక్కడ సందర్శకుల సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన స్టాండ్ మీద నుంచి కాలు జారడంతో ఆమె జలపాతంలో పడిపోయింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితులు వెంటనే అక్కడి సెక్యూరిటీ వాళ్లకు తెలియజేశారు. పోలీసులు పూనమ్ కోసం గాలిస్తున్నారు. కెనడాలోని భారత దౌత్య కార్యాలయం అధికారులు పూనమ్ దీప్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
పూనమ్‌పాండే కౌర్‌ది జలంధర్ జిల్లాలోని లోహియన్ ప్రాంతంలోని ఘుడ్డువల్ ఆమె స్వగ్రామం. ‘పూనమ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. దాంతో, కెనడాలో ఉంటున్న ఆమె కుటుంబసభ్యులు పోలీసులను నిత్యం వాకబు చేస్తున్నారు’ అని పూనమ్ అంకుల్ బల్కర్ సింగ్ తెలిపాడు. అంతేకాదు పూనమ్ శవం దొరికిందని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించాడు.