Ashes Series – Engalnd Squad | బెయిర్‌స్టో ఫిట్.. తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ స్క్వాడ్ ఇదే
Ashes Series - Engalnd Squad : టెస్టు క్రికెట్లో హోరాహోరీ పోరాటాల్లో ఒకటైన యాషెస్ సిరీస్(Ashes Series) మరో రెండు వారాల్లో మొదలవ్వనుంది. ఈసారి యాషెస్ ఫైట్ ఇంగ్లండ్ గడ్డపై జరగబోతోంది. దాంతో, తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బృందాన్ని ప్రకటించింది. ఐర్లాండ్‌తో టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన జోష్ టంగ్(Josh Tongue)...
Ashes Series – Engalnd Squad : టెస్టు క్రికెట్లో హోరాహోరీ పోరాటాల్లో ఒకటైన యాషెస్ సిరీస్(Ashes Series) మరో రెండు వారాల్లో మొదలవ్వనుంది. ఈసారి యాషెస్ ఫైట్ ఇంగ్లండ్ గడ్డపై జరగబోతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023) తర్వాత ఆస్ట్రేలియా ఈ సిరీస్ కోసం సన్నద్ధం కానుంది. దాంతో, తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బృందాన్ని ప్రకటించింది. ఐర్లాండ్‌తో టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన జోష్ టంగ్(Josh Tongue) జాక్‌పాట్ కొట్టాడు. అద్భుత ప్రదర్శన చేసిన ఈ యంగ్‌స్టర్ యాషెస్ తొలి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు.
పాదం గాయం నుంచి కోలుకున్న జానీ బెయిర్‌స్టో (onny Bairstow)మళ్లీ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. మొదటి టెస్టు జూన్ 16న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. రెండో టెస్టు జూన్ 28న లార్డ్స్ స్టేడియంలో మొదలవ్వనుంది.
మొదటి రెండు టెస్టులకు ఇంగ్లండ్ స్క్వాడ్ : బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్, జేమ్స్ అండర్సన్,స్టువార్ట్ బ్రాడ్, డాన్ లారెన్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
జోష్ టంగ్‌ను అభినందిస్తున్న సహచరులు

లార్డ్స్‌లో ఇంగ్లండ్ జోరు
యాషెస్ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ 5 వికెట్లు తీశాడు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ను 172కే కట్టడి చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(182) సెంచరీ, ఓలీ పోప్ (205) డబుల్ సెంచరీతో కదం తొక్కారు. దాంతో, 524/4 వద్ద కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐర్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. మూడో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు స్కోర్.. 294/6
ఇవి కూడా చదవండి
Ajinkya Rahane | గతాన్ని పట్టించుకోను.. ఐపీఎల్లో ఆడినట్టే డబ్ల్యూటీసీ ఫైనల్లో చెలరేగుతా : రహానే
Ravi Shastri | ఆస్ట్రేలియా ఫేవరెట్ కావొచ్చు.. ట్రోఫీ గెలిచేది టీమిండియానే : రవిశాస్త్రి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

