వీసా కోసం వెళితే వెకిలి చేష్టలు : పాక్ ఎంబసీ అధికారులపై మహిళా ప్రొఫెసర్ ఫైర్!
ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని పంజాబ్‌కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు.
చండీఘఢ్ : ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని పంజాబ్‌కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. 2021లో పాకిస్తాన్‌ను సందర్శించేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేందుకు తాను పాక్ ఎంబసీని సందర్శించిన సమయంలో అక్కడి సీనియర్ అధికారులు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. అప్పటి ఘటనను గురించి ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు.
తాను పాకిస్తాన్ హై కమిషన్‌తో ఆన్లైన్ వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నానని ఆమె చెప్పారు. తాను లాహోర్‌లోని ఓ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వాల్సిఉందని, అక్కడి కట్టడాల గురించి రాయదలుచుకున్నానని ఎంబసీ అధికారులకు తెలిపానని గుర్తుచేసుకున్నారు. తాను అక్కడనుంచి వెళుతుండగా మరో అధికారి అక్కడికి వచ్చి తనను వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగారని చెప్పారు. మీరు ఎందుకు పెండ్లి చేసుకోలేదని తనను ప్రశ్నించాడని, పెండ్లి చేసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారని, లైంగిక వాంఛలు ఎలా తీర్చుకుంటారని అనుచితంగా ప్రశ్నించాడని తెలిపారు.
వేరే టాపిక్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన తన ప్రశ్నలతో వేధించాడని పంజాబ్ ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాను విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌కూ ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ పోర్టల్లోనూ గతంలో ఆమె ఫిర్యాదు చేయడంతో పాటు పాక్ విదేశాంగ మంత్రి బులావల్ భుట్టోకి లేఖ రాశారు. పాక్ హైకమిషన్ అధికారితో జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లనూ ఆమె విదేశాంగ మంత్రికి పంపారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే భారీ మొత్తం చెల్లిస్తామని ప్రలోభపెట్టినా తాను తిరస్కరించానని మహిళా ప్రొఫెసర్ వెల్లడించారు. పాక్ హై కమిషన్ కార్యాలయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించినా ఎవరూ స్పందించకపోవడంతో ఈ ఘటనపై ప్రజల ముందుకొచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. పాక్ హై కమిషన్ వద్దకు వెళ్లే భారత మహిళలు పాక్ అధికారుల ఉద్దేశాలను తెలుసుకోవాలని మహిళా ప్రొఫెసర్ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Pakistan Embassy
- Punjab
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

