జహీరాబాద్, ఆగస్టు 1 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లో నిమ్జ్ ప్రా జెక్టు కోసం భూసేకరణ వ్యవహారంలో బాధిత రైతులకు హైకోర్టులో ఊరట లభించిం ది. భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులు నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీచేయడంతో శనివారం గ్రా మం లో బాధిత రైతులు సంబురాలు జరుపుకొన్నా రు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం సారవంతమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని రేజింతల్ రైతులు కొంతకాలంగా ఆం దోళనలు చేపట్టారు.
నిమ్జ్ట్ కోసం అధికారు లు గ్రామంలోని 1,880 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములు సేకరించాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూములను సేకరించి కొంతమంది బాధిత రైతులకు పరిహారాన్ని అందించారు. మూడు పంటలు పండే సారవంతమైన భూ ములను సేకరించవద్దని బాధిత రైతులు మొదటి నుంచి వాదిస్తున్నారు. పలుమార్లు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, నిమ్జ్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. బలవంతంగా భూసేకరణ చేపట్టడంతో రైతులు మూడేండ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. బాధిత రైతుల వాదనలు విన్న హైకోర్డు రేజింతల్ గ్రామానికి సంబంధించిన 292మంది రైతులకు సంబంధించిన 566.12 ఎకరాలకు నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పుతో గ్రామం లో రైతులు కొబ్బరికాయలు కొట్టి, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.