వర్సిటీ రిక్రూట్మెంట్కు ఏప్రిల్లోపే గడువు
విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2027 ఏప్రిల్యే డెడ్‌లైనా..? అంతలోపే నోటిఫికేషన్లు విడుదల చేయాల్సిందేనా..? ఆ తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఉపయోగముండదా..? అంటే అవుననే అంటున్నారు విద్యారంగ నిపుణులు. వర్సిటీ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఇదే గడువుగా పేర్కొంటున్నారు.
- ఆ తర్వాత భర్తీకి నో చాన్స్.. ముగియనున్న వీసీల పదవీకాలం
- మళ్లీ ఖాళీల వివరాల సేకరణ.. జీవో-21లో స్వల్ప మార్పులు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2027 ఏప్రిల్యే డెడ్‌లైనా..? అంతలోపే నోటిఫికేషన్లు విడుదల చేయాల్సిందేనా..? ఆ తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఉపయోగముండదా..? అంటే అవుననే అంటున్నారు విద్యారంగ నిపుణులు. వర్సిటీ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఇదే గడువుగా పేర్కొంటున్నారు.
ఆ తర్వాత చేపట్టినా అడుగులు ముందుకు పడటం కష్టమంటున్నారు. వీసీల పదవీకాలం చివరి దశలో.. అంటే ఆరు మాసాల ముందు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. గతంలోని వీసీలు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. 2024 అక్టోబర్ 18న రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వీసీలను నియమించారు. ఈ లెక్కన వీసీల పదవీ కాలం 2027 అక్టోబర్‌తో ముగుస్తుంది. ఆరు నెలల ముందు అంటే.. 2027 ఏప్రిల్‌లోపు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుందని విద్యారంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
ఏడాది నుంచి జీవో-21 చుట్టూ చకర్లు
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్ర భుత్వం జారీ చేసిన జీవో-21 కూడా నియామక ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానంలో అకాడమిక్/రీసెర్చ్ పనితీరుకు 50 మారులు, విషయ పరిజ్ఞానం-బోధనా నైపుణ్యానికి 30 మారులు, ఇంటర్వ్యూకు 20 మారులను సర్కార్ నిర్దేశించింది. జీవోలో ఇచ్చిన వెయిటేజీ యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ కొందరు నిరుద్యోగ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేశారు. నిబంధనలు మార్చకపోతే న్యాయపోరాటానికి వెళ్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం-అభ్యర్థుల మధ్య అనిశ్చితి నెలకొన్నది. ఫలితంగా జీవో వెలువడి ఏడాది దాటినా నియామక ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
వీసీలతో సమీక్ష.. మార్పులపై కసరత్తు
ఇటీవలే ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో సమీక్ష నిర్వహించింది. నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే జీవో-21లో మార్పులు అవసరమని పలువురు వీసీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో జీవో-21లో పూర్తిస్థాయి మార్పులు కాకుండా స్వల్ప సవరణలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. యూనివర్సిటీలవారీగా ఖాళీల వివరాలను అధికారులు మళ్లీ సేకరిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే అసెంబ్లీలో 1,061 పోస్టులు భర్తీచేస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాకుండా.. 460 పోస్టులు భర్తీచేయవచ్చని ఉన్నత విద్యామండలి సర్కార్‌కు నివేదిక సమర్పించింది. ఇవన్నీ ఉండగానే మళ్లీ ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. బ్యాక్లాగ్ పోస్టులు, ఖాళీల వివరాలు వేర్వేరుగా సేకరిస్తున్నారు. రెగ్యులర్ పోస్టులతోపాటే సమాంతరంగా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేయనున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

