న్యూఢిల్లీ, జనవరి 24: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్ పోలీసులు జలంధర్‌లో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్‌తో కలిసి పంజాబ్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో నిషేధిత ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’ (బీకేఐ) పన్నిన ఉగ్ర పన్నాగాన్ని అడ్డుకున్నారు.
హోషియాపూర్ ఘర్శంకర్లో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2.5 కిలోల ఆర్డీఎక్స్, రెండు పిస్తోళ్లు వీటికి సంబంధించి తూటాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర డీజీపీ తెలిపారు. ఆమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బీకేఐ హ్యాండ్లర్స్ ఈ ఉగ్ర కుట్రను ఆపరేట్ చేస్తున్నట్టు చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు లక్ష్యంగా బాంబు పేలుళ్లకు పాల్పడాలన్నది నిందితుల పన్నాగంగా ఉందని పేర్కొన్నారు.