న్యూఢిల్లీ: పంజాబ్(Punjab)కు చెందిన ఓ వ్యక్తి తన కన్న కూతుర్ని అత్యంత కిరాతంగా చంపాడు. తన ఇంట్లోనే కూతుర్ని చంపిన అతను.. ఆమె శరీరాన్ని బైక్ కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశాడు. ఈ ఘటన అమృత్సర్ జిల్లాలో జరిగింది. నిందితుడు బావూ ఓ కార్మికుడు. 20 ఏళ్ల కూతురి ప్రవర్తనపై అతనికి అనుమానాలు రావడంతో ఆమెను చంపేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అమృత్సర్ జిల్లాలోని జంధియాలా పట్టణంలో ఉన్న ముచ్చల్ గ్రామంలో జరిగిందని డీఎస్పీ కుల్దీప్ సింగ్ వెల్లడించారు. బైక్కు కూతురిని కట్టేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి.