Punjab | ఇటుకబట్టీల్లో 20 శాతం వరి గడ్డిని తప్పనిసరిగా ఉపయోగించాలిః పంజాబ్ ప్రభుత్వం
పంట వ్యర్థాల నిర్వహణకు పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఇటుకబట్టీ యజమానులు ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే ఇంధనంలో 20 శాతం వరిగడ్డిని తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదివారం పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరిగడ్డిని కాల్చడం అడ్డుకోవడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతేకాదు వరిగడ్డిని ఇటుక బట్టీల యజమానులకు అమ్మడం ద్వారా రైతులు ఆర్థికంగా లాభపడతారని రాష్ట్ర పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాక మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హయర్ చెప్పారు. అంతేకాదు వరిగడ్డిని ఇటుకలు కాల్చేందుకు వాడడంలో సహాయం చేస్తామని తెలిపారు.
ఇటుకబట్టీల్లో 20 శాతం వరిగడ్డిని ఇంధనంగా ఉపయోగించేందుకు ఇటుకబట్టీ యజమానులకు ప్రభుత్వం ఆరు నెలల సయమం ఇచ్చింది. వచ్చే ఏడాది మే 1వ తేదీ నుంచి ఈ ఆదేశాలను పాటించని ఇటుకబట్టీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
వరి పంట కోత పూర్తయిన తర్వాత పంజాబ్ రైతులు చాలామంది వరిగడ్డికి నిప్పుపెడతారు. దాంతో, ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. అందుకని ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇటుకబట్టీల్లో వరిగడ్డి వాడకాన్ని తప్పనిసరి చేసింది.పంట వ్యర్థాలను నిర్వహించేందుకు పంజాబ్ ప్రభుత్వం త్వరలోనే 1.5 లక్షల మంది రైతులకు సబ్సీడీ ద్వారా యంత్రాలు అందించనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

