High Court | చంఢీగఢ్: ఒక కేసులో అనుమానితుడిని ఏకబిగిన 15 గంటల పాటు ప్రశ్నించడం వీరత్వం కాదని ఈడీపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇది మనిషి గౌరవానికి తీవ్ర వ్యతిరేకమని పేర్కొంది. నిందితులను అన్ని గంటల పాటు వేధించడం కన్నా వారిని ప్రశ్నించేందుకు సహేతుకమైన సమయాన్ని నిర్దేశించుకోవాలని, న్యాయమైన విచారణ విధానాన్ని అవలంబించాలని ఈడీ అధికారులకు సూచించింది.
ఈ సందర్భంగా త్వరలో హర్యానా ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈడీ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పవార్‌ను విడిచి పెట్టాలని ఆదేశించింది. పన్వర్ అక్రమ మైనింగ్ కేసులో ఆయనను జూలై 19న ఈడీ ఏకబిగిన 14 గంటల 40 నిమిషాల పాటు ప్రశ్నించింది.