Punjab | ఛండీగఢ్, ఏప్రిల్ 8: పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఇక నుంచి ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు మే 2 నుంచి జూలై 15 వరకు పనివేళలు మారుస్తున్నట్టు చెప్పారు.
వేసవిలో విద్యుత్తు భారం తగ్గించడానికే ఈ నిర్ణయమని, ఉద్యోగులు, నేతలను దీనిపై సంప్రదించామన్నారు. విద్యుత్తు లోడ్ 300 నుంచి 350 మెగావాట్ల వరకు తగ్గుతుందని ఆయన చెప్పారు. తాను కూడా ఇక నుంచి ఉదయం 7.30 గంటలకే కార్యాలయానికి వస్తానని సీఎం భగవంత్ మాన్ తెలిపారు.