నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో తన ఇల్లును కాపాడుకునేందుకు పంజాబ్‌లోని ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. సుఖ్విందర్ సింగ్ సుఖీ అనే రైతు తన రెండంతస్తుల భవనం మొత్తాన్ని ఇలా 500 అడుగులు వెనక్కి జరిపించాడు. ఢిల్లీ-అమృత్సర్-కాత్రా ఎక్స్‌ప్రెస్‌వేలో సంగ్రూరులోని రోషన్వాలా గ్రామానికి చెందిన ఈ రైతు ఇల్లును వెనక్కి జరుపుకొని ప్రస్తుతం అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు.