న్యూఢిల్లీ: కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రత్యేక పంజాబ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఈ ఆరోపణలు చేయడంతో వివాదం చెలరేగింది.
ఎమ్మెల్యేలు అందరికీ ఆల్కహాల్ మీటర్ పరీక్ష నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా డిమాండ్ చేయడంతో వివాదం ముదిరింది. రాష్ర్టాధినేతపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన దృష్ట్యా నిజాన్ని నిర్ధారించడానికి ప్రతి ఎమ్మెల్యే పరీక్షను ఎదుర్కోవాలని ఆయన కోరారు.