చెన్నై: డీలిమిటేషన్‌ను అమలు చేస్తే తమ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. పార్లమెంట్లో ప్రస్తుతం 2.39 శాతంతో తమ రాష్ట్రం నుంచి 13 మంది లోక్‌సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆయన తెలిపారు. డీలిమిటేషన్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ స్థానాలను 850కు పెంచితే.
తమ రాష్ట్రంలో మరో ఐదు సీట్లు పెరుగుతాయని అన్నారు. అయితే లోక్‌సభలో తమ ప్రాతినిథ్య శాతం 2.11 శాతానికి పడిపోతుందని చెప్పారు. కనీసం గతంలో లాగ తమ ప్రాతినిథ్యాన్ని 2.40 శాతానికే ఉంచుకోవాలన్నా పంజాబ్‌కు 21 సీట్లు ఇవ్వాలన్నారు. అయితే పంజాబ్‌లో బీజేపీ ఎలాగూ గెలవదు కాబట్టి, తమ రాష్ర్టానికి కేంద్రం సీట్లు పెంచే ప్రసక్తే ఉండదని భగవంత్ మాన్ అన్నారు. అంటే డీలిమిటేషన్‌తో పంజాబ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.