ముంబై: మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (LOP) తనను నియమించాలని పుణె (Pune) జిల్లాలోని బోర్ ఎమ్మెల్యే (Bhor MLA) సంగ్రామ్ థోప్టే (Sangram Thopte) కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానికి లేఖ రాశారు. ఇప్పటివరకు విపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ (NCP) నేత అజిత్ పవార్ (Ajit Pawar) సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుప్రకటించారు. ఈ నెల 2న ఎన్సీపీని చీల్చిన అజిత్.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీలతో కూడిన మహావికాస్ అఘాడీ కూటమి (MVA) నేత పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు చెందిన బోర్ ఎమ్మెల్యే సంగ్రామ్ థోప్టే తనను ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు (Mallikarjun Kharge) లేఖ రాశారు.
గతంలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు విపక్ష నేతగా తనను ఎంపిక చేశారని, అయితే ఆ స్థానంలో అజిత్ పవార్ వచ్చి చేరారని అందులో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అజిత్ ఎన్సీపీతో లేరని, పశ్చిమ మహారాష్ట్రలోని రాజకీయ అవసరాల దృష్టా తనను ఎల్ఓపీగా నియమించాలని కోరారు. పుణెలో పార్టీ పటిష్టంగా ఉండటానికి అది తోడ్పడుతుందని చెప్పారు.