Pune: బుర్ఖాలో వచ్చి లక్షన్నర విలువైన బంగారు నగలు చోరీ చేశారు
బుర్ఖాలో వచ్చి రూ.1.5లక్షల బంగారు కమ్మలు చోరీ చేసిన ఇద్దరు మహిళలు
పునేలోని ఒక బంగారు నగల దుకాణంలో బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు బంగారు నగల్నిచోరీ చేశారు. పునేలోని చందానగర్లో ఉన్న నహర్ అనే బంగారు నగల దుకాణంలోకి ప్రవేశించిన వీళ్లు బంగారు చెవి కమ్మలు దొంగతనం చేశారు. ఆ చెవి కమ్మల విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని షాపు యజమాని యశ్ నహర్ చెప్పాడు. అయితే, అక్టోబర్ 26వ తేదీనే ఈ దొంగతనం జరిగింది. కానీ, ఈ విషయాన్నిదుకాణంలోని ఉద్యోగులు ఎవరూ గుర్తించలేదు. రెండు రోజుల క్రితం కంప్యూటర్లో నగల జాబితాని చెక్ చేస్తుండగా బంగారు కమ్మలు కనిపించలేదు. దాంతో అనుమానం వచ్చిన షాపు యజమాని సీసీ టీవీ పుటేజీ చెక్ చేశాడు.
అక్టోబర్ 26వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు వచ్చారు. నగలు చూపించాలని సేల్స్మెన్ని అడిగారు. కొంతసేపటి తర్వాత ఆ ఇద్దరు మహిళలు హడావిడిగా దుకాణం నుంచి బయటకు వెళ్లడం గమనించాడు. వాళ్లే దొంగతనం చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

