Delhi Blast : దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ కారు పేలుడు(Delhi Blast) కేసులో డొంక కదులుతోంది. బాంబు పేలుడు కుట్రతో సంబంధమున్న ఒక్కొక్కరిని పోలీసులు, దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్ర దర్యాప్తు బృందం, జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్స్ ఈ కేసుతో ప్రమేయం ఉందనే అనుమానంతో మరొకరిని అరెస్ట్ చేశాయి. ఎర్రకోట వద్ద జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో పుల్బామాలో పని చేస్తున్న తుఫైల్ అహ్మద్ (Tufail Ahmed / నియజ్ భట్)అనే ఎలక్ట్రీషియన్‌ను అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న సంభవించిన కారు పేలుడులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. 14 మంది అమాయకులను బలిగొన్న ఈ ఉగ్రకుట్రకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే శ్రీనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ తుఫైల్ అహ్మద్‌ను రాష్ట్ర దర్యాప్తు బృందం, జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్ టీమ్ అరెస్టు చేశాయి. శ్రీనగర్‌లో నివాసముంటున్న తుఫైల్ను శనివారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Delhi Blast Case#UPDATE || J&K SIA has detained Tufail Niyaz Bhat & Dr. Muneeb.
Tufail was reportedly working as an OGW for a terror outfit: @SaahilSuhail shares more details with @HeenaGambhir
Watch this report by @AnkitBhat09, detailing how the Police officials have… pic.twitter.com/yq7IwLhsup
— TIMES NOW (@TimesNow) November 22, 2025
కారు పేలుడులో తుఫైల్ ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. తుఫైల్కు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. అయితే.. అతడు ఏరకంగా కుట్రకు సహకరించాడు? అనేది తెలియనుంది. ఢిల్లీ పేలుడుతో సంబంధమున్న కుల్గాంలోని డాక్టర్ ముజాఫర్ అహ్మద్ రాథర్పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. అయితే శనివారం తుఫైల్తో పాటు కుట్రతో సంబంధమున్న డాక్టర్ మునీబ్‌ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం.