ఢిల్లీ జామా మసీదులో భారీ నిరసన.. వీడియో
న్యూఢిల్లీ: ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామా మసీదులో ఇవాళ భారీ ప్రదర్శన చేపట్టారు. భారీ సంఖ్యలో ముస్లింలు మసీదు వద్ద ఆందోళన నిర్వహించారు. ఢిల్లీతో పాటు యూపీలోని షహరాన్పూర్లోనూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇండియాలోనే అతిపెద్ద మసీదు అయిన జామా మసీదు వద్ద ఇవాళ శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు నినాదాలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నుపుర్ శర్మ, నవీన్ జిందాల్పై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆ ఇద్దర్నీ అరెస్టు చేయలేదు.
#WATCH People in large numbers protest at Delhi's Jama Masjid over inflammatory remarks by suspended BJP leader Nupur Sharma & expelled leader Naveen Jindal, earlier today
No call for protest given by Masjid, says Shahi Imam of Jama Masjid. pic.twitter.com/Kysiz4SdxH
— ANI (@ANI) June 10, 2022
ఓవైసీ మనుషులేమో..
నిరసన ప్రదర్శనకు మసీదు కమిటీ పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహి ఇమామ్ తెలిపారు. మసీదు ముందు నిరసన ప్రదర్శన చేపట్టినవారు ఎవరో తమకు తెలియదన్నారు. శుక్రవారం ప్రదర్శన చేపట్టాలని కొందరు గురువారం ప్లాన్ చేశారని, కానీ వాళ్లు మసీదు అనుమతి ఇవ్వలేదని షాహి ఇమామ్ తెలిపారు. ఆందోళన చేపట్టినవాళ్లు బహుశా ఎంఐఎం పార్టీ లేదా ఓవైసీ మద్దతుదారులై ఉంటారని ఆయన అన్నారు. నిరసన చేపడుతున్నవారికి తాము మద్దతు ఇవ్వడంలేదని ఆయన స్పష్టం చేవారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

