Protests at Imphal hospital | ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ నిరసన.. గాయపడిన కుకీ యువకులను భద్రత మధ్య తరలింపు
Protests at Imphal hospital | మణిపూర్‌లో జాతుల మధ్య హింస కారణంగా మూడేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడంపై నిరసనలు వెల్లువెత్తాయి.
ఇంఫాల్: మణిపూర్‌లో జాతుల మధ్య హింస కారణంగా మూడేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు గాయపడ్డారు. (Protests at Imphal hospital) ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు వారిని తరలించారు. అయితే నాగా వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మే 13న కిడ్నాప్ అయ్యారు. జూన్ 10న వారి మృతదేహాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
కాగా, కాల్పుల్లో గాయపడిన కుకీ యువకులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడంపై నిరసనలు వెల్లువెత్తాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. గాయపడిన కుకీ యువకులు మిలిటెంట్లు అని ఆరోపించారు. కొందరు నిరసనకారులు ఆసుపత్రి భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
మరోవైపు పోలీసులు, భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఆసుపత్రి వద్ద ఉన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలతో దాడి చేశారు. ఆసుపత్రిలో చేరిన గాయపడిన ముగ్గురు కుకీ యువకుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో భారీ భద్రత మధ్య చురాచంద్పూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- force
- Hospital
- Imphal
- Kuki youths
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

