Protest : బీహార్ (Bihar) లో ఎన్డీఏ సర్కారు (NDA govt) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ (NSUI), ‘పలాయన్ రోకో, నౌకరీ దో’ (Palayan Roko, Naukri Do) పాదయాత్ర నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వారి పాదయాత్ర బీహార్ రాజధాని పట్నాలోని సీఎం నివాసానికి చేరుకోగానే.. పలువురు నిరసనకారులు ఆ నివాసంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
దాంతో అప్పటికే అక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్న పోలీసులు.. కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు నిరసనకారులపై వాటర్ కానన్లు ప్రయోగించారు. అయినా పలువురు నిరసనకారులు బారీకేడ్లను తోసుకుని వెళ్లగా పోలీసులు అరెస్ట్ చేశారు.
#WATCH | Patna, Bihar: Police uses water cannon and detains Congress workers trying to head towards the CM residence during their ‘Palayan Roko, Naukri Do’ padyatra. pic.twitter.com/mUmOGQg9Kd
— ANI (@ANI) April 11, 2025