Kolkata Incident : కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం సమీపంలో ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం పెద్దసంఖ్యలో మహిళలు, యువత నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ దారుణానికి పాల్పడిన దోషులను తక్షణమే అరెస్ట్ చేసి ఉరి తీయాలని ఈ సందర్భంగా నిరసనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
#WATCH | West Bengal: Protest held near Salt Lake stadium in Kolkata against the rape and murder of a woman resident doctor in RG Kar Medical College and Hospital. pic.twitter.com/Uu8P5omlJg
— ANI (@ANI) August 18, 2024
దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, తమ కూతురిని వైద్యురాలిని చేసేందుకు తామెంతో కష్టపడ్డామని, చివరకు ఆమెను కిరాతకంగా హత్య చేశారని కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ ఆస్పత్రి ఘటనలో బాధితురాలి తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. దోషిని వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చినా ఇంతవరకూ ఏం జరగలేదని విచారం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని, అయితే ఈ ఘటనలో పలువురి ప్రమేయం ఉందని తాను భావిస్తున్నా్నని చెప్పారు.
ఈ ఘటనకు మొత్తం డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. తమ కూతురి హత్యాచార ఘటనపై పెల్లుబుకిన నిరసనను చల్లార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నానని అన్నారు. ప్రజలు నిరసన చేపట్టకుండా నిరోధించేందుకు ఈరోజు 144 సెక్షన్ విధించారని అన్నారు.
Read More :