Boy Dies After AC Falls | బిల్డింగ్ పైనుంచి ఏసీ పడటంతో బాలుడు మృతి.. వీడియో వైరల్
Boy Dies After AC Falls | ఒక బిల్డింగ్ వద్ద ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మూడో అంతస్తు నుంచి ఏసీ ఊడిపడింది. స్కూటర్‌పై కూర్చొన్న యువకుడి తలపై నేరుగా అది పడటంతో అతడు మరణించాడు. అతడి పక్కనే ఉన్న మరో యువకుడు గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: ఒక బిల్డింగ్ వద్ద ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మూడో అంతస్తు నుంచి ఏసీ ఊడిపడింది. స్కూటర్‌పై కూర్చొన్న యువకుడి తలపై నేరుగా అది పడటంతో అతడు మరణించాడు. (Boy Dies After AC Falls) అతడి పక్కనే ఉన్న మరో యువకుడు గాయపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 17న సాయంత్రం 6.50 గంటలకు కరోల్ బాగ్‌లో విషాదకర సంఘటన జరిగింది. బిల్డింగ్ ప్రవేశ ద్వారం దగ్గర ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు. ఆగిన స్కూటర్‌పై ఒక యువకుడు కూర్చొని ఉండగా అతడి పక్కగా మరో యువకుడు నిల్చొని ఉన్నాడు. వారిద్దరూ మాటల్లో బిజీ అయ్యారు.
కాగా, ఉన్నట్టుండి ఆ భవనం మూడో అంతస్తు నుంచి పాత ఏసీ ఊడి పడింది. స్కూటర్‌పై కూర్చొన్న 19 ఏళ్ల యువకుడి తలపై నేరుగా అది పడటంతో కుప్పకూలి మరణించాడు. పక్కనున్న యువకుడు కూడా కింద పడి గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ విషాదకర సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Deadly incident: Karol Bagh
A tragic incident occurred in Karol Bagh, although the exact date and location are unknown.
A condenser from a split AC fell on a young man, causing instant death.@DelhiPolice pic.twitter.com/Pl7xQy8AE9
— Atulkrishan (@iAtulKrishan1) August 18, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

