ముంబై : బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ బుధవారం భీవండి పోలీసుల ఎదుట హాజరుకాలేదు. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాంగ్మూలం నమోదు చేసేందుకు బుధవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఈ కేసులో పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు నుపుర్ శర్మ నాలుగు వారాల గడువును కోరారు.
అయితే, ఇప్పటి వరకు నవీన్ జిందాల్ ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ జూన్ 5న జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్చార్జి నవీన్ జిందాలను పార్టీ నుంచి బహిష్కరించింది. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంతో పాటు అరబ్ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే భీవండిలో నుపుర్ వర్మ, జిందాల్‌పై పోలీసు కేసు నమోదైంది.