Yogendra Yadav | హైదరాబాద్, మే 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఈ లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధిస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం బూటకమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో బీజేపీకి 240-260 మధ్య సీట్లు రావొచ్చు.
ఎన్డీయే కూటమిలోని మిగతా పార్టీలు 35-45 సీట్లు గెలవొచ్చు. ఇక కాంగ్రెస్కు 85-100 స్థానాలు లభించవచ్చు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మిత్రపక్షాలకు 120-135 సీట్లు రావొచ్చు’ అని పేర్కొన్నారు. ఏపీలో లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 15 సీట్లు రావొచ్చని తెలిపారు. టీడీపీ-జనసేనకు 12, బీజేపీ మూడు సీట్లు నెగ్గవచ్చని అంచనా వేశారు.